Saturday, May 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం..కీలక నిర్ణయం

ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం..కీలక నిర్ణయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ, ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 13,100 మంది సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు, హెల్త్ కార్డుల జారీ వంటి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఎంను కోరారు.

ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే తొలి నిర్ణయం తీసుకున్నామని, ప్రతి నెలా ఒకటో తేదీకే జీతాలు అందేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సీఎం వివరించారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం పేర్కొన్నారు. వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీతో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అంశంపై తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా పీఆర్సీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యంగా పీఆర్సీ, హెల్త్ కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -