Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాన్యుల నడ్డి విరచడమే బిజెపి సర్కార్ మ్యానిపిస్టో

సామాన్యుల నడ్డి విరచడమే బిజెపి సర్కార్ మ్యానిపిస్టో

- Advertisement -

ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్
నవతెలంగాణ – పెద్దవూర
బిజెపి ప్రభుత్వం 19 కేజీ ల వాణిజ్య సిలిండర్ ధరలను ఒకేసారి రూ.993 పెంచి సామాన్యులను మోసం చేసిందని ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ అన్నారు.శనివారం హాలియా లో తమ నివాసం లో మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో ఆరు సార్లు వాణిజ్య సిలిండర్ ధరలను దాదాపు 83 శాతం అంటే డిసెంబర్ 2025 లో 1800 రూపాయలు ఉన్న ధర నిన్నటి పెంపు తో 3,314 రూపాయాల కి చేరుకుందని అన్నారు.ఇబ్బడిముబ్బుగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని  ఆవేధన వ్యక్తం చేశారు. ఈ నియంత్రణ మరియు నిలకడలేని ధరల వలన సామాన్యులు పేద వర్గాలలో పెను భారం పడుతుందని అన్నారు.హోటల్స్, టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్, హాస్టల్స్, విద్యార్థులు, వలసకార్మికులకు తీవ్ర ఆర్ధిక భారాన్ని చూపుతుంది అని తెలిపారు. పేద వర్గాలని మోసం చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం గా పెట్టుకుంది అని అన్నారు.అదే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎన్నికల కోసమే పనిచేసే ప్రభుత్వం బిజెపి అని, పేద వర్గాల సంక్షేమమే లక్ష్యం గా పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ లోని ఏ ముఖ్యమంత్రి చేయని కులాల వారీగా లెక్కలు వెల్లడించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కృషి చేస్తున్నారనికొనియాడారు..మోదీ సర్కార్ పెంచిన వాణిజ్య సిలిండర్ ధరలను వెంటనే తగ్గించి సామన్యులపైన విధించిన ఆర్ధిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -