Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులకు రూ.15 కోట్ల నిధులు మంజూరు

అభివృద్ధి పనులకు రూ.15 కోట్ల నిధులు మంజూరు

- Advertisement -

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు

మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి,పెద్దపల్లి జిల్లాల్లోని పది మండలాల్లో సిఆర్ఆర్ క్రింద సిసి రోడ్లు,డ్రైన్ల అభివృద్ది పనులకు గాను రూ.15 కోట్ల నిధులు మంజూరైనట్లుగా రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.పెద్దపల్లి జిల్లాలో రూ.7 కోట్లు మంథని మండలానికి రూ.3 కోట్ల 30 లక్షలు,ముత్తారం మండలానికి రూ.1కోటి 55 లక్షలు,రామగిరి మండలానికి రూ.1కోటి 35 లక్షలు,కమాన్పూర్ మండలానికి రూ.60 లక్షలు,పాలకుర్తి మండలానికి రూ.20 లక్షలు. భూపాలపల్లి జిల్లాలో రూ.8 కోట్లు మంజూరైయాయి.

కాటారం మండలానికి రూ. 2 కోట్ల 50 లక్షలు,మహాముత్తారం మండలానికి రూ.1 కోటి 75 లక్షలు,మహదేవ్ పూర్ మండలానికి రూ.1కోటి.45 లక్షలు,పలిమేల మండలానికి రూ.70 లక్షలు, మల్హర్ రావు మండలానికి రూ.1.కోటి 60 లక్షలు, మండలంలోని అడ్వాలపల్లికి రూ.5 లక్షలు, అన్సాన్ పల్లికి రూ.10 లక్షలు,చిన్నతూండ్లకు రూ.5 లక్షలు,దుబ్బపేటకు రూ. 10 లక్షలు,ఎడ్లపల్లి కి రూ.30 లక్షలు,ఇప్పలపల్లికి రూ.10 లక్షలు,కొండంపేటకు రూ.10 లక్షలు,కొయ్యూరుకు రూ.10 లక్షలు,మల్లంపల్లికి రూ.5 లక్షలు,మల్లారంకు రూ.5 లక్షలు,నాచారంకు రూ. 5 లక్షలు,పెద్దతూండ్లకు రూ.15 లక్షలు,గాదంపల్లికి రూ.5 లక్షలు,రుద్రారంకు రూ. 20 లక్షలు,తాడిచెర్లకు రూ.10 లక్షలు,వల్లెంకుంటకు రూ.10 లక్షలు, అడుగగానే రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు పది మండల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు, గ్రామపంచాయతీ సర్పంచ్లు,పాలకవర్గం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -