జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని శేఖపూర్, కోడ్చిర్, అంతాపూర్, ఎక్లారా చిన్న శివారులో ఏప్రిల్ చివరి వారంలో సంభవించిన అగ్ని ప్రమాదాల కారణంగా మక్క (మొక్కజొన్న) రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం రైతుల దగ్గర కి వెళ్లి వారిని మనోధైర్యం ఇచ్చి ప్రభుత్వాన్ని రైతులకు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం, వల్ల క్వింటాల్‌కు రూ.500-600 తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో పాటు పాలొన్న మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సి పటేల్, మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, సీనియర్ నాయకులు పండిత్ రావు పటేల్, మాజీ సర్పంచ్ ఎంకే పటేల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాలి బూడిదైన మొక్కజొన్న పంట రైతులకు ఆదుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



