Monday, May 4, 2026
E-PAPER
HomeజాతీయంTamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం

Tamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం సాధించింది. తాజా నివేదికల ప్రకారం.. ఐదు స్థానాల్లో సిపిఐ(ఎం), సిపిఐ అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యంతో ముందున్నారు. తిరుత్తురైపూండి, తాలి, శ్రీవిల్లిపుత్తూరు, పద్మనాభపురం, కిల్వె వెలూరు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యంలో ఉంది. పద్మనాభపురంలో సిపిఐ(ఎం) అభ్యర్థి ఆర్. చెల్లస్వామి 10,344 ఓట్లు సాధించి, 822 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కిల్వె వెళూరులో సిపిఐ(ఎం) అభ్యర్థి టి. లతా 7,060 ఓట్లు పొంది, 250 ఓట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీవిల్లిపుత్తూరులో సిపిఐ(ఎం) అభ్యర్థి పి.మహాలింగం 2,893 ఓట్లతో, 456 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు. తిరుత్తురైపూండిలో సిపిఐ అభ్యర్థి కె.మారిముత్తు 21,983 ఓట్లతో 4,488 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాలి నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి టి. రామచంద్రన్ 14,114 ఓట్లతో, 743 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -