Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత కార్మిక చట్టాల రూపశిల్ప డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 

భారత కార్మిక చట్టాల రూపశిల్ప డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 

- Advertisement -

డాక్టర్ రాజేష్ కుమార్ 
నవతెలంగాణ-మిడ్జిల్

భారత కార్మిక చట్టాల రూప శిల్ప డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశలు అందరు కొనసాగించాలని పశువైద్య డాక్టర్ రాజేష్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు శ్రీశైలం అన్నారు. శనివారం మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.మే డే సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని అన్ని వర్గాల ప్రజలు పిల్లలను చదువుపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు  నరసింహ, చెన్నయ్య, యాదయ్య, చెన్నయ్య  వెంకటయ్య, లాలు, శివ పవన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -