Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి  
నవతెలంగాణ-మిడ్జిల్ 

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రైతులు పండించిన ప్రతి పంట ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి చెప్పారు. సోమవారం మండల కేంద్రంతోపాటు కొత్తూరు,  వెలుగోముల, చిల్వేర్, మున్నానూర్, వేముల గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా  చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి మాట్లాడుతూ. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని చెప్పారు. వడ్లు మొదటి రకం 2389, రెండో రకం 2369 రూపాయలతోపాటు సన్న వడ్లకు 500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సిద్ధార్థ, సర్పంచులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, రాములు, సువర్ణ, నాగరాజు గౌడు, సుజాత మల్లికార్జున రెడ్డి, నాగమ్మ, పిఎసిఎస్ సి ఓ బాల్ రెడ్డి, నాయకులు అల్వాల్ రెడ్డి, సాయిలు, మహమ్మద్ గౌస్, కొత్తూరు వెంకటయ్య, రైతులు, ఆయా గ్రామాల ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -