Homeఆదిలాబాద్8 ఎకరాల్లో జొన్న పంట దగ్ధం

8 ఎకరాల్లో జొన్న పంట దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని కిషన్ నాయక్ తండా గ్రామ శివారంలో జొన్న పంట సోమవారం మధ్యాహ్నం అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా వ్యవసాయ క్షేత్రంలో నుంచి మంటలు చెలరేగడంతో రైతులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఈదు గాలులు లేవడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 8 ఎకరాల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటలు చేతికొచ్చే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వెంటనే అధికారులు పంటలను పరిశీలించి, నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -