Monday, May 4, 2026
E-PAPER
Homeజిల్లాలుమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

- Advertisement -

– రైతుల శ్రమకు న్యాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎల్ దేశ్య నాయక్ డిమాండ్
నవతెలంగాణ – ఉప్పునుంతల 

ఉప్పునుంతల మండలంలో విస్తారంగా సాగుచేసిన మొక్కజొన్న పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేస్ అనుబంధం) జిల్లా అధ్యక్షుడు ఎల్ దేశ్య నాయక్ అన్నారు. మండల వ్యాప్తంగా సుమారు పదివేల ఎకరాల్లో పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన కోరారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ ధాన్యాన్ని అమ్మేందుకు ఎదురుచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులకు నష్టాలు కలుగుతున్నాయని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నాగరాజు, రైతు సంఘం నాయకులు పానుగంటి బాలయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -