Tuesday, May 5, 2026
E-PAPER
Homeసినిమా'విశ్వంభర'లో అవనిగా..

‘విశ్వంభర’లో అవనిగా..

- Advertisement -

చిరంజీవి నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతోంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన స్పెషల్‌ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ‘అవని’ పాత్ర పోషించిన హీరోయిన్‌ త్రిషా కష్ణన్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సాంప్రదాయ దుస్తులలో వెలుగుతున్న దీపాల పళ్ళెం పట్టుకుని త్రిష ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. గోల్డ్‌ కలర్‌ బ్యాక్‌డ్రాప్‌ పోస్టర్‌కు పండుగ వాతావరణాన్ని జోడించింది. దర్శకుడు వశిష్ట విజువల్‌ వండర్‌, మాస్‌ అప్పీల్‌ మేళవించి ‘విశ్వంభర’ను అద్భుతంగా తీర్చిదిద్దు తున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, మౌని రారు ఒక స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: వశిష్ట, నిర్మాతలు: విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌, సంగీతం: ఎంఎం కీరవాణి, భీమ్స్‌ సిసిరోలియో, డీఓపీ: చోటా కె నాయుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -