Monday, May 4, 2026
E-PAPER
Homeసినిమాఅసాధారణ ప్రభంజనం

అసాధారణ ప్రభంజనం

- Advertisement -

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాట జరిగిన ఎన్నికల్లో ఊహించని భారీ మెజారిటీతో గెలుపొందిన అగ్ర కథానాయకుడు, టీవీకే పార్టీ అధినేత విజరుకి సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిం చారు. ఈ అసాధారణ విజయం సినిమాని తలపిస్తోం దంటూ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ సత్తా చాటుతూ గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని అగ్ర కథానాయకుడు చిరంజీవి సోషల్‌ మీడియద వేదికగా స్పందించారు. ‘డియర్‌ విజరు.. మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన విజయానికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు నిరంతరం ప్రేరణగా నిలుస్తూ, నాయకత్వం వహించి సేవ చేయాలని కోరుకుంటున్నాను. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మీ ప్రజా సేవ మరింతగా మేలు కలిగించాలని ఆశిస్తున్నాను’ చిరంజీవి నటుడు తలచుకుంటే చరిత్రను తిరగరాయగలడని తమిళనాట ఎం.జి.ఆర్‌, తెలుగునాట మా నాన్న ఎన్టీఆర్‌ నిరూపించారు. మళ్ళీ ఆ ప్రభంజనాన్ని స్ఫురణకు తెచ్చిన సోదరుడు విజరుని అభినందిస్తున్నాను. తమిళ ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమే ఆశయంగా తన ప్రస్థానం కొనసాగాలని అభిలషిస్తున్నాను. – బాలకృష్ణ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -