Monday, May 4, 2026
E-PAPER
Homeసినిమాకేవలం 4 రోజుల్లో రూ.4.8 కోట్లు

కేవలం 4 రోజుల్లో రూ.4.8 కోట్లు

- Advertisement -

ధనుష్‌, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్‌ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్‌ నిర్మించిన చిత్రం ‘కర’. దీనికి విఘ్నేశ్‌ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్‌ స్టార్‌ లాజిస్టిక్స్‌ బ్యానర్‌ మీద సిహెచ్‌ సతీష్‌ కుమార్‌, రాజేష్‌ కుమార్‌ బొబ్బర రిలీజ్‌ చేశారు. రిలీజ్‌ రోజు నుంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్లతో దూసుకెళ్తోంది.కేవలం నాలుగు రోజుల్లోనే సినిమా రూ.4.8 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించటం విశేషం.ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో తనదైన స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న ధనుష్‌ ఈ సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మమితా బైజు బెస్ట్‌ పెర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను అలరించింది. దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ పాత్ర హద్యంగా ఆకట్టుకుంటోంది. మన దేశంలో పంటలు పండించే రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో ఓ సమస్యను ఇతివత్తంగా చేసుకుని ఈ సినిమాను రూపొం దించారు దర్శకుడు విఘ్నేశ్‌ రాజా. జివి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం, నేపథ్య సంగీతం, తేని ఈశ్వర్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్‌ హైలైట్స్‌గా నిలిచాయి. కరసామి పాత్రలో ధనుష్‌ ఒదిగిపోయిన తీరుకి ఆడియెన్స్‌ బ్రహ్మ రథం పడుతున్నారు. గ్రిప్పింగ్‌, థ్రిల్లింగ్‌, హై ఇంటెన్షన్‌ స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకులు సినిమాను ఆసాంతం ఎంజారు చేస్తున్నారు అని చిత్రయూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -