Tuesday, May 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినవ్విపోదురుగాక….

నవ్విపోదురుగాక….

- Advertisement -

పెద్దనోట్ల రద్దు విప్లవాత్మక సంస్కరణగా రేపు విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. నిజానికి ఆ నిర్ణయం దేశ అసంఘటిత రంగాన్ని తీవ్ర విధ్వంసం చేసింది. చిన్న తరహా పారిశ్రామిక రంగం స్తంభించింది. కోట్లాది మంది జీవనోపాధి దెబ్బతిన్నది. నల్లధనాన్ని వెలికితీయడం, విదేశీ బ్యాంకుల నుంచి ఆ మొత్తాలను వెనక్కి రప్పించడం, తీవ్రవాదానికి నిధులు అందకుండా చేయడం, ఆర్థిక వ్యవస్థల్లో నగదు చెలామణిని తగ్గించడమన్నవి. ఈ వినాశకర నిర్ణయాన్ని సమర్ధిస్తూ పేర్కొన్న లక్ష్యాలు. కానీ వీటిల్లో ఏ ఒక్కటీ నేటికీ నెరవేరకపోగా దీనికి విరుద్ధంగా పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రజల్లో చెలామణిల్లో ఉన్న నగదు కంటే రెండింతలు పెరిగిందని ఆర్బీఐ గతంలోనే చెప్పింది. మరి దీని నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిందేమిటి?

చరిత్ర లేనివాళ్లు చరిత్రను వక్రీకరిస్తారు. తాము లేని చరిత్రల్లోకి తామే అధినాయకులైనట్టు అడ్డదారిన జొర్లబడతారు. ఇందుకు అడ్డాప్పే అసలు చరిత్రను తొలగించే దుష్కృత్యానికి తెరిస్తారు. పాఠ్య పుస్తకాల కాషాయీకరణ, చరిత్ర వక్రీకరణ రెండు దశల్లో జరుగుతోంది. నిజ చరిత్రకు మసిపూయడం, తగ్గించటం, తొలగించటం మొదటి దశ అయితే.. తాము లబ్ధి పొందే అంశాలను పుస్తకాల పుటల్లోకి ఎక్కించటం రెండో దశ. ఆ రెండు దశలను దాటుకొని ఇప్పుడు మూడో దశకు చేరుకుంది. కొందర్లు నరేంద్ర మోడీ అభిమానుల ప్రభు భక్తి ఇప్పుడు విద్యా సంస్థలకు కూడా పాకడంతో ఆయన తత్వమే ఇప్పుడు యూనివర్సిటీ పాఠ్య ప్రణాళికగా మారింది. మోడీ తత్వం, ఆరెస్సెస్‌ చరిత్ర అంశాలను గుజరాత్, ‌వడోదరలోని మహారాజ సయాజీరావు యూనివర్సిటీ సోషియాలజీ పీజీ కోర్సుల్లో పాఠ్యాం శాలుగా చేర్చింది. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు” అన్నట్టు ఉంది ఆ విశ్వవిద్యాలయం తీరు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రీయ భావాలకు బదులు అశాస్త్రీయ భావాలను ఎక్కువగా విస్తరింప చేస్తున్నదనడానికి ఇదొక తాజా ఉదాహరణ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ లోనే కౌరవులు కుండల్లో పుట్టారని, అదే ‘టెస్ట్ ట్యూబ్ బేబీ’ అని ప్రచారం చేయడం. విమానాన్ని రైట్ సోదరులు కనిపెట్టక ముందే పుష్పక్ష విమానం’ ఉండేదని అందులో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుందని వీరు సెలవిస్తారు. శివుడు వినాయకునికి ఎనుగు తల్ల పెట్టాడని అదే ‘ప్లాస్టిక్ సర్జరీ’ అని అంటారు. ఇదే మోడీ తత్వం!. ఈ తత్వాన్ని ఇప్పుడు విద్యార్థులు చదువుకొని అపరమేధావులు కావాలా? విశ్వవిద్యాలయ అధికారుల ప్రభుభక్తికి విద్యార్థులు బలికావాలా?
పాఠ్య పుస్తకాల్లో తనకు అనుకూల మైన మార్పులను చొప్పించే పనిని మోడీ ప్రభుత్వం చాలా కాలంగా చేస్తోంది. ఎప్పటికప్పుడు విద్యావేత్తలు, మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా వాటిని లక్ష్యపెట్టకుండా ముందుకెళు తోంది. ఉన్నత విద్యా సంస్థల ముఖ్య స్థానాల్లో ఆరెస్సెస్ నేపథ్యమున్న వ్యక్తులను కూచోబెట్టి, పాఠ్య పుస్తకాలను కాషాయీ కరించే కార్యక్రమాన్ని ప్రారం భించింది. ఇందుల్లో భాగంగానే ఎన్‌‌సిఈఆర్‌‌టి పాఠ్య పుస్తకాల్లో మత సామరస్యాన్ని బోధించే పాఠాలను ఒకటొక్కటిగా అటకెక్కించారు. డార్విన్‌ జీవపరిణామంతో సహా భగత్సింగ్ భావాలను మత వివక్ష గురించి పూలే, అంబేద్కర్ చెప్పిన సంగతులను పాఠాల్లోంచి తొలగించారు. ప్రపంచమంతా సైన్ను నమ్ముకుని పరిశోధన చేస్తుంటే.. మన పాలకులు మాత్రం అశాస్త్రీయ ఆలోచనల చట్రంలో ప్రజలను బంధించే పనిని చాలా ఆత్మవిశ్వాసంతో చేస్తున్నారు. తాజాగా అవీఇవీ తొలగించడం ఎందుకని ఏకంగా ఆరెస్సెస్ భావజాలాన్ని నేరుగా ఒక కోర్స్ గా ప్రారంభిస్తున్నట్టు విశ్వవిద్యాలయం చెప్పడం శోచనీయం.

పెద్దనోట్ల రద్దు విప్లవాత్మక సంస్కరణగా రేపు విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. నిజానికి ఆ నిర్ణయం దేశ అసంఘటిత రంగాన్ని తీవ్ర విధ్వంసం చేసింది. చిన్న తరహా పారిశ్రామిక రంగం స్తంభించింది. కోట్లాది మంది జీవనోపాధి దెబ్బతిన్నది. నల్లధనాన్ని వెలికితీయడం, విదేశీ బ్యాంకుల నుంచి ఆ మొత్తాలను వెనక్కి రప్పించడం, తీవ్రవాదానికి నిధులు అందకుండా చేయడం, ఆర్థిక వ్యవస్థల్లో నగదు చెలామణిని తగ్గించడమన్నవి. ఈ వినాశకర నిర్ణయాన్ని సమర్ధిస్తూ పేర్కొన్న లక్ష్యాలు. కానీ వీటిల్లో ఏ ఒక్కటీ నేటికీ నెరవేరకపోగా దీనికి విరుద్ధంగా పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ప్రజల్లో చెలామణిలో ఉన్న నగదు కంటే రెండింతలు పెరిగిందని ఆర్బీఐ గతంలోనే చెప్పింది. మరి దీని నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిందేమిటి?
మన దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి పాఠాన్ని పక్కన పడేశారు. కానీ, మోడీతత్వం పేరుతో విద్యార్థుల ఆలోచనలను కలుషితం చేసే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. ఏకంగా ” మ్యాక్స్ వెబర్స్ మహాత్మాగాంధీ, మార్టీన్ లూథర్ కింగ్ వంటి మహానాయకుల నాయకత్వ లక్షణాలకు మోడీ ఏమాత్రం తీసిపోరని, డిజిటల్‌ జాతీయవాదం, పౌరసత్వం, వారసత్వం, ప్రపంచీకరణ, ఉద్యమాలను మోడీ కోణంలో చూపిస్తూ మోడీతత్వాన్ని విద్యార్థులకు బోధిస్తాం.” అంటున్న విశ్వవిద్యాలయ అధికారుల ప్రభుభక్తికి జోహర్లు పలకాల్సిందే.
ఏ వివక్ష, పక్షపాతం లేని పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యార్థుల్లో తప్పుడు భావాలు నాటే దిశగా కోర్స్ రూపకల్పన జరుగుతూ ఉంది. విద్యార్థుల నెత్తిన తను పథకాల ప్రచారం మోపే కుయుక్తి కూడా ఇందులో భాగమే! అహేతుకం, అశాస్త్రీయం, అసత్యాలతో కూడిన కోర్సులను విశ్వవిద్యాలయాలలో ప్రవేశపెడితే రేపటి పౌరులు ఎలా తయారవుతారు? ఇది ఆందోళన కలిగించే పరిణామం. దీన్ని వ్యతిరేకించటం ఆలోచనాపరులందరి కర్తవ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -