మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
యువత,విద్యార్థులు క్రీడలలో రాణిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు మండలం కొలనుపాక జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని చెప్పారు.యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని ప్రతిభను చాటుకోవాలని సూచించారు.క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవడం ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన వంటి మంచి లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రీడలలో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



