Thursday, May 7, 2026
E-PAPER
Homeసినిమాసెట్స్ అని పసిగట్ట లేరు..

సెట్స్ అని పసిగట్ట లేరు..

- Advertisement -

రామ్ చరణ్ నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా బుధవారం ‘పెద్ది` కోసం వేసిన సెట్స్ విశేషాల గురించి మీడియాతో పంచుకున్నారు.
డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు నా పదేళ్ల కెరీర్‌లో ఒక కథకి ఇంతలా ఎగ్జైట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. కథ విన్న తర్వాత ఓ 20 నిమిషాల పాటు నేను మనిషిని కాలేకపోయాను. అంతలా కదిలించింది. ‘పెద్ది’ విజయనగరం ఏరియాలో జరిగే కథ. అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ కూడా రీ క్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేశాం. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో ఇప్పటివరకు ఎవరూ చూడని కుస్తీ సెటప్ చేశాం. చరణ్ గదతో కనిపించిన షాట్ అక్కడే చేశాం. ఇందులో ఒక హిల్ స్టేషన్ ఊరు కావాలి. అది హైదరాబాద్‌లోని ఒక బూత్ బంగ్లాలో వేశాం. మీరు సినిమా చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న ఊరిలా అనిపిస్తుంది. ఆ సెట్ వేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే ఇందులో చెరుకు ఫ్యాక్టరీ ఉంటుంది. అది కూడా సెట్. కాకపోతే అందులో బ్యూటీ ఏంటంటే మీరు ఒక్కటీ కూడా సెట్ అని పసిగట్టలేరు. డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్‌ ఒక సింక్‌లో ఉంటే సినిమా ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులో అలాంటి మంచి సింక్ కుదిరింది. రత్నవేలుతో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మంచి కోఆర్డినేషన్‌తో వర్క్ చేశాం. ఇందులో క్రికెట్ ఉంది. అయితే అది ‘లగాన్’ లాగా ఉండదు. ‘లగాన్’ బ్రిటిష్ కాలంలో జరిగిన కథ. ఇది 70-80 మధ్యలో విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు మన ఊర్లో పొలాల గట్ల మీద కూర్చుని క్రికెట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అంత నేచురల్ ఫీలింగ్ క్యారీ అవుతుంది. ‘పెద్ది’ కోసం స్క్రాచ్ నుంచి వేసిన సెట్స్ 24 ఉంటాయి. అలా కాకుండా సెటప్స్ అయితే దాదాపు 60-70 పైగానే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘పెద్ది’ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు. సుకుమార్ ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’కి మించి ఉంటుందని అన్నారు. దానికి కారణం ఈ కథలో అంత బలం ఉంది. ఆ బలానికి తగ్గట్టే దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -