- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదల ఆరోగ్యానికి ఒక వరం లాంటిదని డోంగ్లి మండల పరిధిలోని ఏనా బోరా గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యునుస్ పటేల్ అన్నారు. గురువారం లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన బాధితులందరికీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



