
నవతెలంగాణ- వేములవాడ: తరగతి గదిలోని విద్యార్థుల బాల్యం తీర్చిదిద్ద పడుతుందని వాణి విద్యాలయ కరస్పాండెంట్ లు అనంతరెడ్డి, మహేష్ లు అన్నారు..బాలల దినోత్సవనీ బుధవారం వాణి విద్యాలయం హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. బాల దినోత్సవం పురస్కరించుకొని పిల్లలు ఉపాధ్యాయులుగా మారి వారి కేటాయించిన తరగతికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఉపాధ్యాయ అర్హత అంటే ఒక ఛాలెంజ్ గా విద్యార్థులకు అనుభవాలను పంచుకోవడం పంచుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు వారే దేశాన్ని గర్వకారణం అని అన్నారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్స్ బద్దం అనంతరెడ్డి , పిల్లి మహేష్, పాఠశాల ప్రిన్సిపాల్ బత్తిని రాము, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.