మార్నింగ్ వాకర్స్ ను కలిసిన చల్మెడ

నవతెలంగాణ- వేములవాడ: వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మార్నింగ్ వాకర్స్ ను మంగళవారం వేకువజామున బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు కలిశారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడుతూ ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్స్, వ్యాయమ పరికరాలు సరిగ్గా లేవని, మహిళలకు ప్రత్యేక ట్రాక్ ఉంటే బాగుంటుందని చల్మెడ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో వ్యాయామానికి సంబంధించిన పరికరాలు, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం కొరకు రూ.2కోట్లు మంజూరై, ఎన్నికల కోడ్ వల్ల పనులు నిలిచిపోయాయని, ఎన్నికల ముగిసిన ఆరు నెలల్లోపు పనులు పూర్తవుతాయని అన్నారు. అట్లాగే పట్టణంలో 5ఎకరాల్లో మినీ స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత ప్రారంభించడానికి సిద్ధమవుతోందని, వీటితో పాటు వాకర్స్ కు సంబంధించిన పెండింగ్ పనులను ఏడాది లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేయాలనే ఆశయంతో మీ ముందుకు వస్తున్నానని, అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమీపంలో ఉన్న హోటల్ లో స్థానికులతో కలిసి టీ త్రాగారు. అంతకుముందు వాకర్స్ ను కలిసేందుకు చల్మెడ  బుల్లెట్ వాహనంపై రావడం చూపరులను ఆకట్టుకుంది.  ఆయన వెంట ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, బీఆర్‌ఎస్‌ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, గజానంద రావు,  నరాల దేవేందర్, గోపు బాలరాజు, గూడూరి మధు, ముప్పిడి శ్రీనివాస్, వాకర్స్ బూర సదానందం తదితరులు ఉన్నారు.
Spread the love