నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి అధికారికంగా ముగిసింది. “భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, క్లాజ్ 2 ప్రకారం నాకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, పశ్చిమ బెంగాల్ శాసనసభను 2026 మే 7 నుంచి రద్దు చేస్తున్నాను” అని గవర్నర్ తన నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలను అంగీకరించని మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



