- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రతను క్రెమ్లిన్ మరింత కట్టుదిట్టం చేసింది. కొన్నాళ్ల క్రితం నోవ్‌గోరోడ్ ప్రాంతంలోని ఆయన ప్రయివేటు నివాసం వద్ద పుతిన్ హత్యకు ఉక్రెయిన్ ప్లాన్ చేసినట్టు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్ర జరిగిందన్న వార్తలను అమెరికా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఖండించాయి. కాగా ఈ వార్తలతో రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -



