Tuesday, September 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజెలెన్‌స్కీ సహాయకులతో ట్రంప్‌ దూతల భేటీ

జెలెన్‌స్కీ సహాయకులతో ట్రంప్‌ దూతల భేటీ

- Advertisement -

కీవ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూతలు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జేర్డ్‌ కుష్నర్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహాయకులతో చర్చలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య చర్చల పునరుద్ధరణ కోసం ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఆయన ప్రతినిధులు మాస్కోలో పుతిన్‌తో శనివారం మూడు గంటల పాటు సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారు ఉక్రెయిన్‌ చేరుకొని కీలక చర్చలు జరిపారు. విట్‌కాఫ్‌, కుష్నర్‌లు ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు పక్షాలతో గతంలో అనేక పర్యాయాలు సంప్రదింపులు జరిపినా, రష్యాలో పలు దఫాలు పర్యటించినా వీరిద్దరూ తొలిసారి కీవ్‌కు వచ్చారు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ నేతలు ఉక్రెయిన్‌లో ఉన్నత స్థాయి పర్యటన జరపడం కూడా ఇదే మొదటిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -