39 మంది మృతి
మాడ్రిడ్ : దక్షిణ స్పెయిన్‌లో హై స్పీడ్ రైళ్ళు ఢీకొని 39మంది మరణించారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో హై స్పీడ్‌తో వెళుతున్న రైలు ఎదురుగా వస్తున్న రైలు మీదకు దూసుకెళ్ళిపోయి, తర్వాత పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్ళలోనూ దాదాపు 500మంది ప్రయాణికులు వున్నారని మీడియా వార్తలు తెలిపాయి. ఈ సంఘటనలో ఒక రైలు బాగా దెబ్బతిందని, నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని అగ్నిమాపక దళ చీఫ్ ఫ్రాన్సిస్కో కర్మోనా తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా 200కి పైగా రైళ్ళు సోమవారం రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణం ఇంకా దర్యాప్తు చేయాల్సివుంది. సంఘటనా ప్రాంతంలో పరిస్థితి అత్యంత దారుణంగా వుంది. పైగా ఆ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టంగా వుంది. బాధితులకు అవసరమైన బ్లాంకెట్లు, నీరు వంటివి స్థానికులు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా విస్తృతంగా తిరిగే ఈ హై స్పీడ్ రైళ్ళు స్పెయిన్‌లో బాగా పాపులర్. కాగా ఈ రైలు ప్రమాదం పట్ల భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలియచేశారు.



