Saturday, May 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటా

జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటా

- Advertisement -
  • ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
  • నవతెలంగాణ – మేడ్చల్ కలెక్టరేట్
  • జర్నలిస్టుల సంక్షేమం, మీడియా రంగ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు హెల్త్ కార్డులు, వసతులు, సంక్షేమ పథకాలపై ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కల్లేపల్లి రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి పాక రవీందర్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -