Saturday, May 9, 2026
E-PAPER
Homeకరీంనగర్రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
ఈ నెల 10న హన్మకొండలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్ కుమార్,పీడీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. అండర్-16 విభాగంలో శ్రీ హర్షవర్ధన్ లాంగ్ జంప్, బి.రిషి కుమార్, టి.నవదీప్ జావెలిన్ త్రోలో,అండర్-18 విభాగంలో డి.విశ్వేష్ లాంగ్ జంప్‌లో ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులను సర్పంచ్ ఎంబారీ గౌతమి,ఉపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -