నాగపూర్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని నాగపూర్ గ్రామంలో గురువారం స్థానిక బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశారు. గ్రామంలో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రచార పత్రాలను ప్రతీ ఇంటికి ప్రతీ గడపకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి  వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజలు కూడా మూడవ సారి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈప్ర చార కార్యక్రమంలో ఎస్సి విభాగం మండల నాయకులు పాలెపు రవి కిరణ్, బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సాదుల రాజన్న, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love