Sunday, May 10, 2026
E-PAPER
Homeఆటలువినేశ్‌కు షోకాజ్‌ నోటీసు

వినేశ్‌కు షోకాజ్‌ నోటీసు

- Advertisement -

న్యూఢిల్లీ : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) షాక్‌ ఇచ్చింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పసిడి పోరుకు చేరినా, పతకం చేజార్చుకున్న వినేశ్‌ ఫోగట్‌ రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతుండగా.. భారత రెజ్లింగ్‌ సమాఖ్య రూల్స్‌ రీ ఎంట్రీని అసాధ్యం చేశాయి!. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ యాంటీ డోపీంగ్‌ రూల్స్‌ ప్రకారం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అథ్లెట్లు ఆరు నెలల ముందుగానే యాంటీ డోపీంగ్‌ ఏజెన్సీకి సమాచారం అందించాలి. లేదంటే, ఏ స్థాయి టోర్నమెంట్‌లోనూ ఆడేందుకు అనుమతి ఉండదు. వినేశ్‌ ఫోగట్‌ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు నిరుడు డిసెంబర్‌లో ప్రకటించింది. దీంతో జూన్‌ 26 వరకు వినేశ్‌ ఫోగట్‌ పునరాగమనం చేయడానికి వీల్లేదని రెజ్లింగ్‌ సమాఖ్య స్పష్టం చేసింది. దీంతో పాటు భారత రెజ్లింగ్‌ సమాఖ్య ప్రతిష్ట మసకబారేలా చేసినందుకు 14 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ పసిడి ఫైట్‌ ముందు బరువు పరీక్ష?లో విఫలం కావటం, 2024 మార్చిలో సెలక్ష?న్‌ ట్రయల్స్‌లో రెండు వెయిట్‌ కేటగిరీల్లో పోటీపడటం, పలుమార్లు యాంటీ డోపింగ్‌ ఏజెన్సీకి వేర్‌అబౌట్‌ ఫెయిల్యూర్‌ కావటంపై సమాధానం చెప్పాలని షోకాజ్‌ నోటీసులో రెజ్లింగ్‌ సమాఖ్య పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -