– ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ సెన్సార్లను ఉపయోగించి గ్రామంలోని విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినందున సర్పంచ్ పై గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చాకలి కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్లకు సెన్సార్లు లేకపోవడం వలన విద్యుత్తు వినియోగం పెరగడంతో బిల్లులు భారీగా వస్తూ గ్రామపంచాయతీకి భారంగా మారుతుంది. శాశ్వత పరిష్కారం చేసేందుకు గ్రామస్తులు, పంచాయతీ కార్యవర్గ సభ్యులతో సర్పంచ్ సమావేశం నిర్వహించిన ఆలోచన విధానం ఉపయోగించి సెన్సార్ వాడాలని అభిగతం వ్యక్తం చేశారు. అనుకున్నదే తరువాయిగా భావించి వెంటనే గ్రామపంచాయతీ నిధులతో సెన్సార్లను ఉపయోగించి గ్రామంలోని విద్యుత్ దీపాలను ఆటోమేటిక్ గా వాటికి అవే విద్యుత్తు ప్రసరణ ఆగిపోయి లైట్లు ఆరిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. నాటి నుండి పనిభారం తగ్గడంతో పాటు సెన్సార్ల ద్వారా విద్యుత్ ప్రసరణ జరగకుండా విద్యుత్ భారం గ్రామపంచాయతీ పైన గ్రామ ప్రజల పైన పడకుండా ప్రజల సొమ్ము నిధులు వృధా కాకుండా పరిష్కరించడం జరిగిందని సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జీబీ కార్యవర్గ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సెన్సార్ల పరికరంతో విద్యుత్ ఆదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



