Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగికదాడితో మోడీ బేటీ బచావో-బేటి పడావో వట్టి బూటకం 

మైనర్ బాలికపై బండి భగీరథ్ లైంగికదాడితో మోడీ బేటీ బచావో-బేటి పడావో వట్టి బూటకం 

- Advertisement -

ఆర్.సీత,పీ ఓ డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి
నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

బీ జే పీ ఎంపీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనతో మోడీ మాట్లాడుతున్న భేటీ బచావో,భేటీ పడావో అనే మాట వట్టి బూటకమని తేలిపోయిందని,మోడీ మాట్లాడే బచావో నిజమైతే బీ జే పీ,మంత్రి కొడుకు పై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ, ఆలేరు పట్టణంలో ఆదివారం ప్రగతిశీల మహిళా సంఘం(పీ ఓ డబ్ల్యూ)రాష్ట్ర కార్యదర్శి ఆర్.సీత ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

బాలికలు చదవాలి,ఎదగాలి, ప్రయోజకులు కావాలని ఎవరైనా కోరుకుంటారని,కానీ మోడీ మాత్రం భేటీ బచావో, బేటి పడావో అనడంలో పెద్ద కుట్ర,మహిళలను ఈ నినాదం పేరుతో తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నదని చెప్పారు. మైనర్ బాలికలపై అత్యాచారాలు,హత్యలు అని అర్థం చేసుకోవాలని, మైనర్ బాలిక హిందూవే, రేపిస్టూ హిందువే మరి హిందూ మతాచారాలు,సంస్కృతి, సాంప్రదాయాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. బండి భగీరధ్ అత్యాచారం పై ప్రభుత్వం,చట్టం కఠినంగా వ్యవహరించాలని, శిక్షించాలని,మంత్రి కొడుకు అని,పలుకుబడి గలవాళ్ళనే పేరుతో ఉదారంగా వ్యవహరిస్తే మహిళా లోకం బగ్గుమంటుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -