Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్పరపల్లిలో ఐకేపీ సెంటర్ ప్రారంభం

ఉప్పరపల్లిలో ఐకేపీ సెంటర్ ప్రారంభం

- Advertisement -

మిల్లర్ల అక్రమ కటింగ్‌లను అరికట్టాలని డిమాండ్
నవతెలంగాణ – ఉప్పునుంతల 

ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అనంత రాజేందర్ రెడ్డి, సీఎం ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఏపీఎం బాలచంద్రయ్య, ఐకేపీ సీసీ రాజు, వీఓఏ తొల్ల రాజు యాదవ్, డిప్యూటీ సర్పంచ్ రెసోజు శ్రీనివాసులు, వార్డు సభ్యులు భారతమ్మ, సువర్ణ, పర్వతాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలాలు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చిన తరువాత రైస్ మిల్లర్లు అధిక కటింగ్‌లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. రైతుల గోడును విన్న ఏపీఎం బాలచంద్రయ్య స్పందిస్తూ సమస్యపై తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -