నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11 నుండి 25 వరకు, పిఎం శ్రీ పాఠశాలల్లో ప్రభుత్వం ఉచిత వేసవి శిబిరాన్ని అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ అన్నారు. పిఎంసి పాఠశాల ఆవరణలో సోమవారం ఎర్ర లక్ష్మీ ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వేసవి శిబిరాన్ని 6వ తరగతి నుండి 9వ తరగతి చదివే విద్యార్థులు అందరు ఉపయోగించుకుని పాఠశాలలో గేమ్స్, క్రాఫ్ట్, ఆర్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రావీణ్యం పొందాలని సూచించారు. విద్యార్థులు తీవ్రంగా ఉన్న ఎండల బారిన పడకుండా ఈ సమ్మర్ క్యాంపుని ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల , ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, మేఘరాజు, పూల నాగయ్య, సిఆర్పి మద్దెల తిరుపతి , విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిబిరం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



