Tuesday, May 12, 2026
E-PAPER
Homeసినిమాలెక్క చేయని 'మందారం

లెక్క చేయని ‘మందారం

- Advertisement -

హీరో శర్వానంద్ , దర్శకుడు సంపత్ నంది కాంబోలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సినిమా 'భోగి'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ డింపుల్ హయాతి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో 'మందారం’ అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్ 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఉంది. పోస్టర్‌లో కనిపించిన వింటేజ్ బ్రాస్ బాక్స్, గ్రామీణ వాతావరణం ఆమె పాత్రకు మరింత బలం చేకూర్చాయి. ఆమె చూపుల్లోనే ఒక తిరుగుబాటు స్వభావం కనిపిస్తోంది. ఈ లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసిన మేకర్స్, 'ప్రపంచం కోరుకున్న సౌందర్యం.. ప్రపంచం ఎన్నడూ అర్థం చేసుకోని ఆత్మ, మందారంను పరిచయం చేస్తున్నాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవల చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిం చింది. హైదరాబాద్‌లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించి చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -