– ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని నాగులమ్మ క్రాస్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంథని నుండి కాటారం వెళ్తున్న ఇసుక లారీ కాటారం నుండి తాడిచెర్ల వైపు వస్తున్న బొగ్గు లారీలు ఎదురుఫురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంతో కాటారం-మంథని ప్రధాన మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగులమ్మ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
- Advertisement -
- Advertisement -



