- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన దోనికేర గంగామణి తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య సహయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని సంప్రదించారు. బాధితురాలు అనారోగ్య పరిస్థితులను అర్థం చేసుకున్న ఆయన వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.4 లక్షల మంజూరు చేయించారు. అట్టి మంజూరు పత్రాన్ని మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ రెడ్డికి బాధితురాలు గంగమణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



