నవతెలంగాణ-సత్తుపల్లి : సింగరేణి సంస్థ పరిధిలోని సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనుల అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షల కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన సమూహ నిరాహార దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకు చేరాయి.తమకు రావలసిన ప్రయోజనాలను తక్షణమే మంజూరు చేయాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. వేతన పెంపుదల (పే అప్‌గ్రేడేషన్)పనితీరు ఆధారిత చెల్లింపులు (పీఆర్పీ) తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 13వ రోజు నిరాహార దీక్షలో వి. వేణుగోపాల్ రావు,ఎస్. లోకేష్, జి. నరేష్ పాల్గొన్నారు. తమ సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించి పరిష్కరించాలని, అంతవరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
సత్తుపల్లి సింగరేణిలో 13వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


