రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలి
అభ్యర్థులకు న్యాయం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వ విద్య కేంద్రీకరణ వల్లే నీట్ పరీక్ష రద్దైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఎన్టీఏను రద్దు చేయాలనీ, రాష్ట్రాలకు పరీక్ష నిర్వహించుకునే హక్కు కల్పించాలనీ, నీట్ పరీక్ష అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ ఎన్టీఏ తప్పులతో లీక్ కావడంతో పరీక్షను రద్దు చేశారనీ, దీంతో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్ అంధకారంలోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా కేంద్రీకరణ కారణంగా పరీక్షల నిర్వహణ లో పారదర్శకత లేకుండా వరుసగా పేపర్ లీకులు అవుతున్నాయని తెలిపారు. గతంలో 2024 లో నీట్, నెట్ పరీక్షలు లీకై రద్దైనప్పుడే ఎన్టీఏ పారదర్శకత, పరీక్షల నిర్వహణ లో అనేక అనుమానాలు ఉన్నాయనీ, అయిన వాటిని సరిదిద్దుకోకుండా మళ్ళీ వరుసగా పేపర్ లీకులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో లీక్ అయితే దేశవ్యాప్తంగా విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. అందుకే విద్యా వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల జాబితాలోని ఉన్న విద్యా హక్కులను కేంద్రం లాక్కొని కేంద్రీకరణ వలన అనేక విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు.తక్షణమే నీట్ లీకేజీపై సమగ్రమైన విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేలా తక్షణమే కేంద్రం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్రం నిర్లక్ష్యం వల్లే నీట్ పరీక్ష రద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



