గోదావరిలో కావాల్సినన్ని నీళ్లున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం కుటిలబుద్దితో తెచ్చిన కరువు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణ-నంగునూరు
రేవంత్ రెడ్డి మూర్ఖపు పట్టు వీడి వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను నడపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగిన పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం(ప్రకృతి) తెచ్చిన కరవు కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల బుద్ధితో తెచ్చిన కరవు అని ఆరోపించారు. గోదావరి నదిలో కావలసినన్ని నీళ్లు ఉన్నప్పటికీ, కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఈర్ష్యతో కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కావాలనే ఆన్ చేయడం లేదన్నారు. ఎంతటి కరవు వచ్చినా రైతాంగానికి నీరందించేలా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నిండి, సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు 70 నుంచి 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా పంట పండలేదని కాంగ్రెస్ చేసే ప్రచారం సరైందికాదన్నారు. కాళేశ్వరం నీళ్లతో పంటలు పండుతున్నాయనడానికి తిమ్మాయిపల్లి గ్రామం సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు స్థిర ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు తిమ్మాయిపల్లిలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుం కాలేశ్వరం జలాలతో ఈ ప్రాంతం బంగారు పంటలతో కళకళలాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు నర్మెట ఫ్యాక్టరీ ద్వారా అద్భుతమైన ఆదాయం లభిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 12 నెలలు జీతాలు వస్తే, ఆయిల్ పామ్ రైతులకు ప్రతి 20 రోజులకు ఒకసారి చొప్పున ఏడాదికి 15 సార్లు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయిల్ పామ్ సాగును మరింత పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు పట్టుదలను వీడి, వెంటనే కాలేశ్వరం మోటార్లను ఆన్ చేసి ఈ కరవు కాలంలో గోదావరి జలాలను పారించేలా ఆ పెద్దమ్మ తల్లి ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్టు తెలిపారు. కార్యమ్రంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ రాగుల సారయ్య, సోసైటీ చైర్మెన్ కోల రమేశ్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనగోని లింగం గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్వీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
బద్దిపడగ గ్రామంలోని ఎస్సీ కాలనీలో పార్టీ నాయకుడు చుంచు స్వామి తండ్రి చుంచు లక్ష్మయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉప్పర మల్లేశం తండ్రి ఉప్పర బాలయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. వడ్లూరి శ్రీనివాస్ తల్లి వడ్లూరి బాలవ్వ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి సానుభూతి తెలిపారు.
సీసీ కెమెరాలు ప్రారంభం
మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలాలను హరీశ్‌రావు ప్రారంభించారు. గ్రామంలో సర్ కార్యక్రమం పై బూత్ లెవల్ అధికారితో మాట్లాడి ఆరా తీశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేర్యాల రాజు, గ్రామపంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.
మూర్ఖపు పట్టు వీడి.. కన్నెపల్లి మోటార్లు నడపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



