Sunday, July 12, 2026
E-PAPER
Homeమెదక్ఆరోగ్య మంత్రి జిల్లాలో ఆస్పత్రులు అధ్వానం

ఆరోగ్య మంత్రి జిల్లాలో ఆస్పత్రులు అధ్వానం

- Advertisement -

సమస్యలకు నిలయం మెదక్ మాతాశిశు ఆరోగ్య కేంద్రం
అవస్థలు పడుతున్న రోగులు, సహాయకులు
పాములు, తేళ్లతో ఆందోళన చెందుతున్న పేషెంట్లు
మెదక్ మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని
 సందర్శించిన సీపీఐ(ఎం) బృందం
సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి

ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వాన్నంగా ఉన్నాయని, మెదక్ మాతాశిశు ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా మారిందని, ఆస్పత్రులను అభివృద్ధి చేయకపోతే ప్రజాఉద్యమాలు చేపడతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రి సిబ్బంది, రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్ప్రతి ఆవరణలో పర్యటించి పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్బంగా చుక్క రాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా మారిందన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్ప్రతులే ఈ విధంగా ఉంటే మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థతి ఇంకెత అధ్వాన్నంగా ఉంటుందో అర్ధమవుతుందన్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలిస్తే.. హృదయవిధారకంగా ఉన్నాయని, ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో ఎక్కడా ఉండబోదన్నారు. పేషెంట్ల సహాయకులు ఉండడానికి కనీస వసతి ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవని, అరుబయటనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి రావడం సిగ్గుచెటని ఆవేదన వ్యక్తం చేశారు. స్నానపు గదుల్లో వాటర్ ట్యాప్స్‌లేవని, స్నానాల కోసం కొంటూరు చెరువుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. విద్యుత్ ద్వీపాలు లేక రాత్రి వేళల్లో ఆస్పత్రికి వచ్చే వాళ్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. కిటికీలు సరిగ్గాలేక పాములు, తేల్లు రాత్రి పూట వార్డుల్లోకి వస్తున్నాయన్నారు. రోగ నిర్దారణ పరీక్షల కోసం ఇబ్బందులు తప్పట్లేవన్నారు. ల్యాబ్‌లో టెస్లులు చేసినా రిపోర్ట్ రావడానికి 24 గంటలు పడుతుందని, దీనితో పేషంట్స్ ప్రయివేట్ ల్యాబ్‌లను అశ్రాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భోజనంలో నాణ్యత ఉండట్లేదని, హాస్పిటల్ ఆవరణలో కిచెన్ ఏర్పాటు చేసే విదంగా కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న ఉమ్మడి జిల్లాలోని మెదక్ మతా శిశు ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా ఉంటే మంత్రికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యం.అడివయ్య, జిల్లా కార్యదర్శి కె.నర్సమ్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం, కె. మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె.సంతోష్, పార్టీ నాయకులు షౌకత్, సావిత్రి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -