Wednesday, May 13, 2026
E-PAPER
Homeరంగారెడ్డిగత ప్రభుత్వం రైస్‌ మిల్లర్లతోమెతకగా వ్యవహరించడం వల్లే సమస్య

గత ప్రభుత్వం రైస్‌ మిల్లర్లతోమెతకగా వ్యవహరించడం వల్లే సమస్య

- Advertisement -

హరీశ్‌రావు రైతులను రెచ్చగొట్టి, సమస్య పెద్దది చేస్తున్నారు : తెలంగాణ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
నవతెలంగాణ-చేగుంట
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైస్‌ మిల్లర్లతో మెతకగా వ్యవహరించడం వల్లనే ధాన్యం కొనుగోలు గాడితప్పిందని, రైస్‌ మిల్లర్లకు ఇచ్చిన అలుసు వల్లనే ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కమిషన్‌ సభ్యులు భవాని రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ధాన్యాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాడి తప్పింది అనడానికి అనేక కారణాలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో రైస్‌ మిల్లర్లు ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) ధాన్యమంతా అమ్మేసుకొని కోట్ల రూపాయల వ్యాపారం చేశారని, వారి మీద కేసులు కూడా పెట్టబడ్డాయని అన్నారు.

ఈ సమస్యతో ఇప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. రైస్‌ మిల్లర్లు మేం చెప్పిందే నడుస్తుందని అనుకుంటున్నారని, ఇది చాలా తప్పు అని అన్నారు. రైస్‌ మిల్లర్లు.. ప్రభుత్వ సివిల్‌ సప్లరుతో ప్రతి సీజన్‌కు అగ్రిమెంట్‌ చేసుకుంటుందని తెలిపారు. కానీ సీనియర్‌ నాయకులైన హరీశ్‌ రావు.. రైతులను రెచ్చగొట్టడం, సమస్యను పెద్దది చేయడం కరెక్ట్‌ కాదన్నారు. మీరైనా, మేమైనా రైతుల సమస్యను పరిష్కారం చేయాలనే చూస్తామని చెప్పారు. ఇటీవల హరీశ్‌రావు ధాన్యం కొనుగోలు కేంద్రం పర్యటించినప్పుడు అక్కడి సమస్యలపై హైదరాబాద్‌కి వచ్చి సివిల్‌ సప్లరు మంత్రికో లేదా చీఫ్‌ సెక్రెటరికో ఎవరికో ఒకరికి రిప్రెజెంట్‌ ఇవ్వాల్సిందని, కానీ అలా చేయకుండా రాజకీయం చేయడం తగదని అన్నారు. కొనుగోలు వ్యవస్థలో ఇబ్బంది జరుగుతున్న విషయం సీఎం దృష్టికి రావడంతో కలెక్టర్లతో మాట్లాడుతున్నారని తెలిపారు. మీరు, మేము కలిసి రైతులను ఆదుకుందామని హరీశ్‌రావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్‌ శివప్రసాద్‌, వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌, ఏపీఎం దుర్గాప్రసాద్‌, సర్పంచ్‌ సండ్రుగు స్రవంతి సతీష్‌, ఉపసర్పంచ్‌ రఫిక్‌, మండల అధ్యక్షులు వడ్ల నవీన్‌ కుమార్‌, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -