Tuesday, June 9, 2026
E-PAPER
Homeరంగారెడ్డిపాలమూరు ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలి

పాలమూరు ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలి

- Advertisement -

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్ లను గడువులోగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని జలసౌధలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్ట్ లపై సీఎం పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక నీటిపారుదల ప్రాజెక్ట్ ల భూసేకరణ, నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాధ్యమైన చోటల్లా ఏకాభిప్రాయం, అవార్డుల ద్వారా భూసేకరణను వేగవంతం చేయాలనీ, పునరావాస ప్యాకేజీలు నిర్వాసిత కుటుంబాలకు ఆలస్యం లేకుండా చేరేలా చూడాలని జిల్లా కలెక్టర్లను కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ల మరమ్మత్తు, పునరుద్ధరణ పనులను పూర్తి చేసి, మార్చి 2027 నాటికి అన్ని మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నార్లాపూర్ జలాశయం కింద వెంటనే కాలువ పనులు చేపట్టాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బాగమైన నార్లాపూర్, యెడుల, ఉద్దండపూర్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. డిసెంబర్ 2026 నాటికి కరివేన రిజర్వాయర్ వరకు ప్రధాన ట్రంక్ మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలన్నారు. మక్తల్-నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 2,200 ఎకరాల భూసేకరణ ప్రక్రియను 2026 జూలై నాటికి ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే రాజీవ్ భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టంపాడు పథకాలకు అవసరమైన భూసేకరణ వెంటనే పూర్తి చేయాలన్నారు.గూడెందొడ్డి జలాశయం నిల్వ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలపై అధికారులతో సమీక్ష‍ించారు. ప్రతి నెలా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్ట్‌ ‌ల పనుల పురోగతిపై సమీక్ష‍ నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించారు. సమీక్ష‍లో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ శ్రీధర్‌, ఈఎన్‌‌సీ రమేశ్‌‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ​​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -