Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించాలి

పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించాలి

- Advertisement -

రవాణా రంగాన్ని రక్షించాలి
ధరల పెంపునకు నిరసనగా జులై 7న ప్రదర్శన
అల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
మధ్యప్రాచ్యంలో యుద్దాన్ని అడ్డంపెట్టుకొని ‌పెంచిన పెట్రోల్, డీజిల్‌ పాటు పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తగ్గించాలని అల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌‌టీడ్ల్యూఎఫ్‌) ఆఫీస్ బేరర్ల సమావేశం పిలుపునిచ్చింది. పెట్రో ధరల పెరుగులకు నిరసనగా వచ్చే జులై ఏడున అన్ని రాష్ర్టాల్లో పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించాలని తెలియజేసింది. ఏఐఆర్‌‌టీడ్ల్యూఎఫ్‌ అఖిల భారత అధ్యక్షులు ఆర్. కరుమలయన్ అధ్యక్షతన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఏఐఆర్‌‌టీడ్ల్యూఎఫ్‌ ప్రధాన కార్యదర్శి జీవన్ సాహ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై ఆఫీస్ బేరర్లందరూ ఆత్మ విమర్శనాత్మకంగా చర్చల్లో పాల్గొన్నారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశం గత కార్యక్రమాలు, అనుభవాలను సమావేశం సమీక్ష చేసింది.ఆ సమీక్ష రిపోర్ట్ ఆధారంగా జులై 31, ఆగస్టు ఒకటిన బీహార్లోని పాట్నాలో ఏఐఆర్‌‌టీడ్ల్యూఎఫ్‌ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఆ సమావేశం విధి, విధానాలు అన్నింటిని ఆఫీస్ బేరర్ల సమావేశంలో తుది రూపం ఇచ్చారు. నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్‌‌సీఆర్‌ ఢిల్లీ) పరిధిలో అనేక పరిశ్రమల్లో నాన్ రెగ్యులర్ కార్మికులు వీరోచితంగా చేస్తున్న పోరాటానికి ఏఐఆర్‌‌టీడ్ల్యూఎఫ్‌ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

నోయిడా కార్మికుల పోరాటానికి మద్దతుగా జూన్ నెలలో ఒక రోజు సంఘీభావ దినంగా జరపాలనీ, ఆ పోరాటం గొప్పతనాన్ని కరపత్రాలు, సమావేశాల ద్వారా రవాణా రంగ కార్మికులకు వివరించాలని నిర్ణయించారు. వారి నుంచి సంఘీభావ నిధిని వసూలు చేసి వారి పోరాటానికి సహాయం చేయాలనీ సమావేశం కోరింది. 2026 సభ్యత్వం 10 లక్షలు పూర్తి చేయాలన్న మహాసభ లక్ష్యం చేరుకోవాలనీ, రవాణా రంగ పరిరక్షణ కోసం ఐక్య పోరాటం కోసం కృషి చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు ఉపసంహరించు కునేలా పోరాటం చేయాలనీ, 2026 అక్టోబర్ లో ఢిల్లీలో జరిగే ప్రదర్శనలో రవాణా కార్మికులను పెద్ద సంఖ్య లో సమీకరించాలని సమావేశం తీర్మానించింది. ఏఐఆర్‌‌టీడ్ల్యూఎఫ్‌ ఆఫీస్ బేరర్ల సమావేశానికి తెలంగాణ పబ్లిక్ , ప్రయివేటు టాన్స్‌‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్, ‌టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహించాయి. ఏఐఆర్‌‌టీడ్ల్యూఎఫ్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిషన్, గౌరవాధ్యక్షులు కెకె దివాకరన్, టీకే రాజన్, కలీషన్, ఎం. శివాజీ, కుప్పుస్వామి, సుబ్రాహ్మణ్యం, రాజ్ కుమార్ ఝా, ఇబ్రహీం కుట్టి, ఆర్. లక్ష్మయ్య, వి. ఎస్. రావు, పి. శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పబ్లిక్ , ప్రయివేటు వర్కర్ల ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. అజయ్ బాబు, టీజీఆర్టీసీ ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ కార్యదర్శి పి. రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి చంద్ర ప్రకాష్, సీఐటీయూ ‌నాయకులు శివ సమావేశం సమావేశం సజావు గా జరగడానికి అవసరం అయిన ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -