Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ చైతన్య బాలిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: పల్లె మురళి

శ్రీ చైతన్య బాలిక ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి: పల్లె మురళి

- Advertisement -

నవతెలంగాణ – మియాపూర్ : మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను కాలేజీలకు రప్పించి బలవంతంగా ఇంటర్ సెకండియర్ క్లాసులను నిర్వహిస్తున్నారని అఖిల భారత విద్యార్థి ప్రజాతంత్ర సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి ఆరోపించారు. అందులో భాగంగానే ఆ ఒత్తిడి తట్టుకోలేక గత మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ విద్యార్థిని కుటుంబానికి సమాచారం ఇవ్వకపోవడంతో అమ్మాయి మానసిక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని ఆ సంఘం నాయకులు తెలిపారు. ఇలాంటి చైతన్య, నారాయణ కార్పొరేట్ కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సమ్మర్ లో క్లాసులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని ఆయన ప్రభుత్వాని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -