ఎమ్మెల్యే సహకారంతో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిలు
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలో గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు లక్ష్యమని కాంగ్రెస్ మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల కుటుంబాలకు సొంత ఇల్లు కల నెరవేర్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సుల్తాన్ పేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రారంభోత్సవం చేపట్టానని తెలిపారు. కార్యక్రమంలో సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ రామ్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హబ్భూ, గ్రామ కాంగ్రెస్ నాయకులు నివార్తి పటేల్ ,షేక్ సలీం, చందు మారాజ్, మునీర్, పాల్గొన్నారు. అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, దాని నిర్మాణానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులకు లబ్దిదారులు మండలాధ్యక్షులు ధరాస్ సాయిలుకు, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చి దిద్దడమే ఎమ్మెల్యే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



