నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో అభివృద్ధి పనులకు జుక్కల్ఎం పీడీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారని ఏపీ కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎంపీడీవో గ్రామ సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు తొ కలిసి చేతుల స్థాయి పరిశీలన చేశారు. ఇంతకుముందు గ్రామంలోని ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల కొరకు మార్కౌట్ ఏసి పనులను ప్రారంభించారు. మంజూరైన లబ్ధిదారులు వెంటనే గృహ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఇందిరమ్మ పథకం నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు వెనువెంటనే మూడు విడుదలుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు మంజూరు చేసి వేయడం జరుగుతుంది తెలిపారు.
అదేవిధంగా గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం లో కూలీలతో చేపడుతున్న కాలువల శుభ్రం చేస్తున్న పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎండలు ఎక్కువ కావడంతో ఉదయం ఆరు గంటలకే పని ప్రదేశంలో హాజరు కావాలని ఆదేశించారు. కులకు నీట వసతి హెల్త్ కిట్టు ను పని ప్రదేశంలో ఉంచాలని సూచించారు. గ్రామంలో చేపడుతున్న సెన్సెస్ సర్వే చేస్తున్న అధికారులతో సర్వే చేస్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వేలు పకడ్బందీగా నిక్కచ్చిగా చేయాలని ఎన్యూమరేట్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము , గ్రామ సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు, ఉప సర్పంచ్, ఈ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి జీవన్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.



