Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలి

- Advertisement -

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ డిమాండ్
నవతెలంగాణ-వర్ధన్నపేట
పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా రాష్ట్రం కేంద్రం బిజెపి, కాంగ్రెస్ లు రక్షిస్తున్నాయని కేసును నీరు కార్చకుండా తక్షణమే అరెస్టు చేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డిమాండ్ చేశారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో జరిగిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర బీజేపీ!.. అధికార మదంతో కేసులను నీరుగార్చడం మహిళా లోకానికే అవమానం. అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు ఒక చట్టం.ప్రముఖులకు మరో చట్టం అమలవుతుందా..? అని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఫోక్సో కేసు నమోదు అయినా ఆ నిందితులను వెంటనే అరెస్టు చేసి విచారణ వేగవంతంగా పూర్తి అవుతుందని. బండి సంజయ్ కొడుకు విషయంలో మాత్రం ప్రత్యేక చట్టాలు అమలు అవుతున్నట్లు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. భారతీయ జనతా పార్టీకి లోపాయికారి ఒప్పందం వల్లే బండి భగీరథ విషయంలో ఇంకా అరెస్టు జరగలేదని విమర్శించారు. కేసును నీరు గార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని.. రాష్ట్రంలో జరిగే ప్రతి పోక్సో కేసు పై సిట్ వేసి విచారణ చేస్తారా.? అంటూ విమర్శించారు.కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సామాజిక బాధ్యతగా.. బేషరతుగా తన కుమారుడిని పోలీసుల ఎదుట హాజరు పరిచి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసును నీరుగార్చాలని ప్రయత్నాలు చేస్తే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అరూరి రమేష్ డిమాండ్ చేశారు 10 ఏళ్లలో కెసిఆర్ గారి హయాంలో ఆర్థికంగా అభివృద్ధి చెందితే రెండున్నర ఏళ్లలో క్రైమ్ లో అభివృద్ధి చెందిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బిక్షపతి మాజీ, పి ఎస్ ఎస్ చైర్మన్లు వనం రెడ్డి, జక్కు రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తుల్ల కుమార్, పట్టణ మాజీ అధ్యక్షులు మధుసూదన్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -