జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు
నవతెలంగాణ-వర్ధన్నపేట
గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్పంచులు వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణతలు ముందున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్తి శారదా దేవి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు లు అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో సర్పంచులకు పాఠశాల విద్యా కార్యక్రమాలపై 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ సభ్యులు కె. ఆర్. నాగరాజు ,వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవీలు ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచులను ఉద్దేశించి మాట్లాడారు.
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతో నైపుణ్యతతో ఉద్యోగాలు పొందుతారు అన్నారు. లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే బదులు ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులచే విద్యనభ్యసించి నేడు రాష్ట్రంలో మహి బాలికలు అధిక శాతం ఉత్తీర్ణత పొందారున్నారు. పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోవర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, వర్ధన్నపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య , సొసైటీ చైర్మన్ రాజేష్ కన్నా , వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు , వరంగల్ ఆర్డిఓ సుమ , వర్ధన్నపేట తాసిల్దార్ విజయసాగర్ పర్వతగిరి తహసిల్దార్ వెంకటస్వామి రాయపర్తి తహసిల్దార్ శ్రీనివాస్ , వర్ధన్నపేట ఎంపీడీవో వెంకటరమణ, రాయపర్తి ఎంపీడీవో కిషన్ , పర్వతగిరి ఎంపీడీవో శంకర్ , వర్ధన్నపేట ఎంఈఓ శ్రీధర్ , రాయపర్తి ఎంఈఓ శ్రీనివాస్ పర్వతగిరి బిక్షపతి , రిసోర్స్ పర్సన్స్ పర్వతగిరి వర్ధన్నపేట రాయపర్తి మూడు మండలాల సర్పంచ్ లు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.



