Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎండలు భగ భగ.. తస్మాస్ జాగ్రత్త

ఎండలు భగ భగ.. తస్మాస్ జాగ్రత్త

- Advertisement -

పిల్లలు, వృద్దులు, గర్భిణీలకు పొంచి ఉన్న ప్రమాదం
వడదెబ్బ తగలకుండా గొడుగులు, టోపీలు పెట్టుకోవాలి
నవతెలంగాణ-శాయంపేట

సమ్మర్ లో విద్యార్థులకు సెలవులు రావడంతో తల్లిదండ్రులు పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చెరువులు కుంటలు బావులలో ఈతకు వెళ్తుంటారు. అక్కడ ప్రమాదవశాత్తూ ఈత రాని విద్యార్థులు కూడా తమ ఫ్రెండ్స్ తో వెళ్లి ప్రమాదాలకు గురవుతుంటారు. అందుకే పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తోడు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎండకు వెళ్లడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలు తమ ఇండ్లలోనే ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా చూడాలి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గేవరకు పిల్లలను ఎండలో తిరగకుండా చూడాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్ తో కలిసి జల్సా లకు అలవాటు పడే ప్రమాదం కూడా ఉంది.

గుట్కాలు సిగరెట్లు మాదకద్రవ్యాలు వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకునే అత్యంత ప్రమాదకరమైన సంఘటనలు జరిగే పరిస్థితులు ఉంటాయి. చెడు ప్రవర్తన కలిగిన ఫ్రెండ్స్ తో కలవకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటూ వారికి దూరంగా ఉండేటట్లు కౌన్సిలింగ్ చేయాలి. అదేవిధంగా రైతులు తమ పంట పొలాలు కోత కోసిన తర్వాత గడ్డిని  చొప్పలను తగలబెడుతుంటారు. దానివల్ల భూమి యొక్క భూసారం తగ్గి పంట దిగుబడి రాదు. కాబట్టి ఎవరు కూడా తమ పంట పొలాలను కాల్చరాదు. ఈ వేసవిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల గాని ఇంకా మరేమైనా ప్రమాదం వల్ల పొలాలు తగలబడే ప్రమాదం పొంచి ఉంటుంది. రైతులు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ అధికారులు సూచనలు పాటిస్తూ ఉండాలి. ఈ వేసవిలో డాక్టర్ సాయి కృష్ణ, ఎస్సై జక్కుల పరమేష్, వ్యవసాయ అధికారి ప్రియదర్శిని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి: ఎస్సై జక్కుల పరమేష్: శాయంపేట
వేసవిలో ఫ్రెండ్స్ తో కలిసి కుంటలు చెరువులు బావులలో ఈతకు పెళ్లి ప్రమాదాలకు గురవుతుంటారు. పిల్లలు  బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలి. ఈ వేసవికాలంలో కుంటలు చెరువులు బావులలో ప్రతి గ్రామ సర్పంచ్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడక్కడ గుంతలు తీసిన ప్రదేశాలు ఉంటాయి. పిల్లలను సమ్మర్  కోచింగ్ కు పంపించడం మంచిది. లేదంటే ఇంటిలోనే వారికి కావలసిన పుస్తకాలను, ఆడుకోవడానికి ఆట వస్తువులను ఏర్పాటు చేయాలి. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేంతవరకు విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి: డాక్టర్ సాయి కృష్ణ మెడికల్ ఆఫీసర్
ఎండ తీవ్రత ని తట్టుకోవడానికి గొడుగులు ఉపయోగించాలి. ఈ వేసవికాలంలో కూలి పనులకు వెళ్లే రైతులు కూలీలు తేలికపాటి దుస్తులు ధరించాలి నల్లటి దుస్తులు ధరించరాదు. గొడుగులు టోపీలు, రుమాలు వంటి వాటిని పెట్టుకోవాలి. ఎక్కువగా మజ్జిగ కొబ్బరి నీళ్ళు నిమ్మరసం లాంటివి తీసుకోవాలి వీలైతే ఓ ఆర్ ఎస్ ద్రావణం అందుబాటులో ఉంచుకోవాలి. తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట, కండరాల నొప్పులు, విరేచనాలు, అతిగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రతలు తగ్గే వరకు బయట తిరగరాదు.

రైతులు  పొలాలను కాల్చరాదు: ప్రియదర్శిని, వ్యవసాయ శాఖ అధికారి
ఈ వేసవిలో రైతులు పంటకోత అయ్యాక గడ్డిని చొప్పలను తగలబెడుతూ ఉంటారు దీనివల్ల భూమిలో భూసారం తగ్గి పంట దిగుబడి రాదు. పంట పొలాలను కాల్చివేయడం నేరం. పంట పొలాలను కాల్చడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ కాలంలో అక్కడక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. రైతులు గమనిస్తూ ఉండాలి. అత్యవసరమైతే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలి. మే నెలలో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు ఎప్పటికప్పుడు పరదాలు సమకూర్చుకొని సిద్ధంగా ఉండాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -