Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ప్రారంభమైన పోచంపల్లి ఫౌండేషన్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం

ఘనంగా ప్రారంభమైన పోచంపల్లి ఫౌండేషన్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతో వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ‘పోచంపల్లి ఫౌండేషన్’ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం పరకాల పట్టణంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కొబ్బరి కాయ కొట్టి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధులు కొక్కిరాల రాకేష్ రావు, చందా కుమారస్వామి మాట్లాడుతూ.. సమాజంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు.

ఈ శిక్షణ కేంద్రంలో పరకాల పట్టణానికి చెందిన నిరుద్యోగ మహిళలు, యువతులకు ఉచితంగా కుట్టుపనిలో అత్యాధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారని నిర్వాహకులు తెలిపారు. 45 రోజుల వ్యవధిలో పూర్తి కానున్న ఈ శిక్షణా కాలం ముగిసిన తర్వాత అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు అందజేస్తామని, తద్వారా వారు సొంతంగా ఉపాధి పొందే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. స్థానిక మహిళలు, యువతులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి, కొక్కిరాల దీప్తి, గందె వెంకటేశ్వర్లు, పంచగిరి శ్రీనివాస్, భగవాన్ రెడ్డి, ఇంగిలి వీరేష్ రావు, పిట్ట స్వప్న దేవేందర్, నాయకులు గంట కళావతి, దగ్గు సునీత, బండి వెంకటేష్, సాంబరాజు జ్యోతి, ఏకు రమేష్, బియా బాని, బొచ్చు వాసు, మాక్సుద్, నాగరాజు, కోటి, సునీల్, ఆకాష్, అంబిర ఉమ, గందే అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు, శిక్షకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -