Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి చేతులమీదుగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన జాతీయ నూలి పురుగుల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ గంగారెడ్డి విద్యార్థులకు ఆల్బెండజల్  మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఏఎన్ఎంలు సుజాత, మమత మాట్లాడుతూ నులిపురుగుల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు.

భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుకోవాలని వివరించారు. నులిపురుగుల వల్ల రక్తహీనత ఏర్పడడంతో పాటు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని తెలియజేశారు. అనంతరం పాఠశాలల్లో  రెండు సంవత్సరాల పిల్లల నుండి 18 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజల్ మాత్రలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, ఉపాధ్యక్షులు రాధారావు గంగాధర్, కుందేటి సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ శ్రీ, వేణుగోపాల్, ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -