Tuesday, July 14, 2026
E-PAPER
Homeజిల్లాలుఘనంగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ వర్ధంతి సభ

ఘనంగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ వర్ధంతి సభ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హస కొత్తూర్  గ్రామంలో  కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండవ వర్ధంతి సభను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా, అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వి. సత్యక్క మాట్లాడుతూ తనకోసం తన పని చేసుకోవడమే కాదు సమాజంలో బడుగు బలహీన వర్గాల కొరకు నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అని కొనియాడారు. సమాజం మార్పు కొరకు పని చేసిన మహా గొప్ప వ్యక్తి అన్నారు.

పోడు భూముల సమస్య పరిష్కరించాలని గిరిజన గ్రామాలు తిరుగుతూ గిరిజనులను ఏకం చేసి భూ పోరాటాలు నడిపిన వ్యక్తి అని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని కోవిడ్ సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటానికి తన వంతు కర్తవ్యంగా ఆ పోరాటంలో పాలుపంచుకున్న చంద్రశేఖర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతామన్నారు. ఆయన చూపిన బాటలో అందరూ నడవాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ వర్ధంతి సభలో పెద్ది రాజేశ్వర్, లక్ష్మీ, గౌరీ, నర్సు, ధనరాజ్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -