నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బుధవారం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అంబేద్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో చలో వర్షకొండ బ్లూ ఆర్మీ ఆవిర్భావ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈనెల 15వ సాయంత్రం 6గంటలకు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా నిర్వహించే బ్లూ ఆర్మీ ఆవిర్భావ సభ ను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ బౌద్ధ పౌర్ణిమ సందర్భంగా భారత సామాజిక సాంస్కృతిక విప్లవ కొనసాగింపులో భాగంగా నిర్వహించే ఛలో వర్షకొండ బ్లూ ఆర్మీ ఆవిర్భావ సభను మండలంలోని అన్ని గ్రామాల బిసి ఎస్సి ఎస్టీ మైనార్టీ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహనీయుల ఆలోచన మార్గంలో ప్రయాణించి సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తూ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి మేకల శ్రీకాంత్, క్రియాశీల కార్యవర్గ సభ్యులు దాసరి రాకేష్, సంజయ్, వినయ్, శ్రీకాంత్, నవీన్, రవిరాజ్, భారత్, భవిత్, తదితరులు పాల్గొన్నారు.



